31.2 C
Hyderabad
Homeఆంధ్రప్రదేశ్నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

మూడో దశ ఎన్నికల కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

బొమ్మిరెడ్డిపల్లి, వెల్దుర్తి, చెరుకులపాడు, కృష్ణగిరిలో తనిఖీలు

100 మీటర్ల పరిధిలో అనవసర వ్యక్తుల సంచారంపై నియంత్రణ

సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా

ఎన్నికలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

కర్నూలు, నవంబర్ 22 (కొత్త స్వరం): గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో దశ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆదివారం బొమ్మిరెడ్డిపల్లి, వెల్దుర్తి, చెరుకులపాడు, కృష్ణగిరిలోని నామినేషన్ కేంద్రాలను సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో అనవసర వ్యక్తుల సంచారాన్ని నియంత్రించాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో ఎస్పీతో పాటు పత్తికొండ డీఎస్పీ వంశీధర్ గౌడ్, సీఐలు రామయ్య నాయుడు, యుగంధర్, మహమ్మద్ గౌస్, చిరంజీవి, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.