27.8 C
Hyderabad
Homeఆంధ్రప్రదేశ్మాజీ మంత్రి కొడాలి నానితో దురుసు ప్రవర్తన..

మాజీ మంత్రి కొడాలి నానితో దురుసు ప్రవర్తన..

  • గుడివాడ ఎస్‌ఐ సత్యనారాయణ వీఆర్‌కు
  • డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ర్యాలీకి అనుమతి నిరాకరణ
  • అనుమతి లేదంటూ కొడాలి నానికి నోటీసులు జారీ
  • దీక్షా శిబిరం వద్ద ఎస్‌ఐ తీరుపై తీవ్ర విమర్శలు
  • ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ కార్యాలయం
  • వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ

గుడివాడ, ఆగస్టు 12 (కొత్తస్వరం):
డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ గుడివాడలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన కార్యక్రమం సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నానితో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వన్‌టౌన్ ఎస్‌ఐ సత్యనారాయణపై జిల్లా ఎస్పీ కార్యాలయం చర్యలు తీసుకుంది. వన్‌టౌన్ ఎస్‌ఐ సత్యనారాయణను వీఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ గుడివాడలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదని పార్టీ నాయకులు తెలిపారు. అనుమతి లేదంటూ మాజీ మంత్రి కొడాలి నానికి ఎస్‌ఐ సత్యనారాయణ నోటీసులు అందజేశారు. ఈ క్రమంలో దీక్షా శిబిరం వద్దకు వెళ్లిన కొడాలి నానితో ఎస్‌ఐ దురుసుగా ప్రవర్తించారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఎస్‌ఐ సత్యనారాయణను వీఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడినట్లు తెలుస్తోంది.

latest articles

explore more

App Icon

Install KS News App

Add to home screen for faster loading and latest updates.