- విత్తనాల చల్లే కార్యక్రమంలో కలెక్టర్
- రైతులకు పీఎండీఎస్ కిట్ల అందజేత
- బొమ్మిరెడ్డిపల్లిలో విత్తనాలు చల్లిన కలెక్టర్
- వ్యవసాయ కార్యక్రమాల్లో అధికారుల భాగస్వామ్యం
కర్నూలు, ఆగస్టు 12 (కొత్తస్వరం):
వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని పొలాల్లో నిర్వహించిన పీఎండీఎస్ కిట్ల పంపిణీ, విత్తనాలు చల్లే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు పీఎండీఎస్ కిట్లను పంపిణీ చేసి, వ్యవసాయ కార్యకలాపాలను పరిశీలించారు. అనంతరం పొలాల్లో విత్తనాలు చల్లే కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, వ్యవసాయ సంబంధిత సహకారం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
