- ఇన్‌ఫ్లో 44,720.. ఔట్‌ఫ్లో 35,315 క్యూసెక్కులు
- ప్రస్తుత నీటి నిల్వ 167.4860 టీఎంసీలు
- పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు
- కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తికి బ్రేక్
- జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
శ్రీశైలం, ఆగస్టు 21(కొత్త స్వరం) :
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 44,720 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 35,315 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ 167.4860 టీఎంసీలుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలుగా ఉంది. జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ పడింది.
