31 C
Hyderabad
Homeతాజా వార్తలుబాల గణేష్ భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

బాల గణేష్ భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

  • శ్రీ బాల గణేష్ భక్త బృందం–ఎస్వీ యూత్ ఆధ్వర్యంలో వేడుకలు
  • ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎస్వీ మోహన్ రెడ్డి, ఎస్వీ విజయ మనోహరి
  • అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన నాయకులు
  • ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
  • కార్యక్రమంలో పాల్గొన్న భక్త బృందం సభ్యులు

కర్నూలు, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) :
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ శ్రీ శ్రీ బాల గణేష్ భక్త బృందం–ఎస్వీ యూత్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు, కర్నూలు అసెంబ్లీ ఇంచార్జ్ ఎస్వీ మోహన్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించి, భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్ రెడ్డి, ఎస్వీ విజయ మనోహరి ప్రజలకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ వినాయక స్వామివారిని ప్రార్థించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో శ్రీ శ్రీ శ్రీ బాల గణేష్ భక్త బృందం–ఎస్వీ యూత్ సభ్యులు మడేల్, భాస్కర్, మహేష్, పవన్, భాష, రమేష్, చోటు, మౌళి, బబ్లు, చింటూ, భరత్, మహేంద్ర, సాయి, చరణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.