- తక్కువ వ్యవధిలో ఉన్నత విద్య అభ్యసించే అవకాశం
వెబ్సైట్లో పూర్తి వివరాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (కొత్తస్వరం): ఇందిరాగాంధీ జాతీయ విశ్వవిద్యాలయం (ఇగ్నో) వివిధ విభాగాల్లో ఏడాది వ్యవధి గల 11 నూతన మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్లను ఇటీవల ప్రారంభించిందని ఇగ్నో హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం సంచాలకులు డాక్టర్ బి. రాజు ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు తక్కువ వ్యవధిలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ ప్రోగ్రామ్లు అవకాశం కల్పిస్తాయని పేర్కొన్నారు. నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు నిర్దేశిత అర్హత ప్రమాణాలకు లోబడి ఈ మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్లకు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఇగ్నో అధికారిక వెబ్సైట్ www.ignou.ac.in ను సందర్శించి ప్రోగ్రామ్లకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చని డాక్టర్ బి. రాజు సూచించారు.
