- డీఆర్ఓ రామ్‌నాయక్‌కు మాల మహానాడు జేఏసీ వినతిపత్రం
- పలుకూరులో 50 ఏళ్లుగా మాలల ఆధీనంలో భూమి ఉందని వెల్లడి
- కమ్యూనిటీ హాలుకు స్థలం కోసం పలుమార్లు తహసీల్దార్‌కు వినతి
- భూమిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ
- న్యాయం జరగకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతాం: దస్తగిరి

నంద్యాల, అక్టోబర్ 8 (కొత్తస్వరం): నంద్యాల జిల్లా డీఆర్ఓ రామ్‌నాయక్‌కు మాల మహానాడు జేఏసీ రాష్ట్ర కార్యదర్శి దస్తగిరి గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ బనగానపల్లె మండలం పలుకూరు గ్రామపంచాయతీలోని సర్వే నంబర్ 57లో గత 50 సంవత్సరాలుగా మాలల ఆధీనంలో ఉన్న భూమిని ఎస్సీ కమ్యూనిటీ హాలుకు కేటాయించాలని కోరుతూ పలుమార్లు బనగానపల్లె తహసీల్దార్‌కు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ పట్టించుకోవడం లేదని తెలిపారు. అయితే ఆ భూమిని కొందరు అగ్రకులస్తులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. పలుకూరు మాలలకు న్యాయం జరగకపోతే మాల మహానాడు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కలెక్టర్, డీఆర్ఓ స్పందించి ఎస్సీ కమ్యూనిటీ హాలుకు స్థలం మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వైసీపీ పుల్లయ్య, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు బి. మద్దిలేటి, మాల మహానాడు నంద్యాల జిల్లా అధ్యక్షుడు బండి దేవాంతకుడు, జిల్లా ఉపాధ్యక్షుడు వై.సత్యం ఎర్రమళ్లతో పాటు పలువురు మాల మహానాడు కార్యకర్తలు పాల్గొన్నారు.
