24.7 C
Hyderabad
Homeతాజా వార్తలువిజయ ప్రత్యూషకు మద్దతివ్వాలి

విజయ ప్రత్యూషకు మద్దతివ్వాలి

  • కూటమి అభ్యర్థులను గెలిపిస్తే నగర అభివృద్ధి వేగవంతం
  • మేయర్ అభ్యర్థిగా విజయ ప్రత్యూష నామినేషన్
  • బీటెక్ పూర్తి చేసిన ఉన్నత విద్యావంతురాలు విజయ ప్రత్యూష
  • 68 వార్డుల్లో సమాన అభివృద్ధికి కృషి చేస్తాం
  • సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం: మంత్రి టీజీ భరత్

కర్నూలు, అక్టోబర్ 19 (కొత్త స్వరం):
కర్నూలు నగర కూటమి మేయర్ అభ్యర్థిగా విజయ ప్రత్యూష నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తీపాటి నాగరాజు, గౌరు జనార్ధన్ రెడ్డి, బీజేపీ నేత సూర్య, జనసేన నేత అర్షద్‌తో కలిసి ఆమె నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ విజయ ప్రత్యూష ఉన్నత విద్యావంతురాలని, బీటెక్ పూర్తి చేశారని తెలిపారు. గత ఎన్నికల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని కార్పొరేటర్‌గా విజయం సాధించిన ఆమె, తన వార్డులో అభివృద్ధి పనుల కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. దివంగత రామకృష్ణ తన వార్డు అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని, ఆయన కుమార్తె విజయ ప్రత్యూషకు ప్రజలు ఆశీర్వాదం అందించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం గెలిచిన వార్డుతో సంబంధం లేకుండా కర్నూలు నగరంలోని అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులు సజావుగా కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని 68 వార్డుల్లోనూ అభివృద్ధి జరగాలంటే కూటమి మరింత బలపడాలని, 2024 ఎన్నికల్లో కూటమికి ప్రజలు అందించిన మద్దతును మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని కోరారు. అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే వారి తీరును ప్రజలు గమనించాలని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కర్నూలు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. కూటమిలోని అభ్యర్థుల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని, నామినేషన్లు, ఉపసంహరణ ప్రక్రియ ముగిసేలోగా సమన్వయంతో అన్ని సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. మేయర్ అభ్యర్థి విజయ ప్రత్యూష మాట్లాడుతూ ప్రజలు తనను తప్పకుండా గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.