20.7 C
Hyderabad
Homeతెలంగాణచెల్లాపూర్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

చెల్లాపూర్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

  • నెహ్రూ జన్మదిన వేడుకలు నిర్వహణ

  • బాలల భవిష్యత్తుపై ప్రధానోపాధ్యాయుడి సందేశం

కుల్కచర్ల, నవంబర్ 14 (కొత్త స్వరం) : మండల పరిధిలోని చెల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తుప్పలి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ నెహ్రూకు పిల్లలంటే ఎంతో ప్రేమని, వారిని ఆప్యాయంగా చూసుకునేవారని, అందుకే పిల్లలు ఆయనను ప్రేమగా ‘చాచా నెహ్రూ’ అని పిలిచేవారని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారే భారతదేశ భవిష్యత్తుకు పునాదులని పేర్కొన్నారు. ప్రతి బాలుడికి నాణ్యమైన విద్య, మంచి ఆరోగ్యం, సత్ప్రవర్తన అందినప్పుడే బంగారు భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగాపురం శకుంతల, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కోస్గి సంతోష, గ్రామ కార్యదర్శి రమాదేవి, అంగన్‌వాడీ టీచర్ శకుంతల, ఆశా వర్కర్ లావణ్య, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, దస్తయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు రాములమ్మ, చెన్నమ్మ, లక్ష్మమ్మ, సత్యమ్మ, శకుంతల, బాలయ్య, చందు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.