- మానసగా గుర్తించిన పోలీసులు
- ఆధార్ కార్డు ఆధారంగా మృతదేహం గుర్తింపు
- వినోద్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కారును అద్దెకు తీసుకున్నట్లు గుర్తింపు
- కరీంనగర్‌లో ఫిట్స్ వచ్చి మృతి చెందినట్లు వెల్లడి
- భయంతో మృతదేహాన్ని కారులో వదిలి వెళ్లినట్లు వినోద్ వాంగ్మూలం
కొత్త స్వరం, హన్మకొండ, ఆగస్టు 21: హన్మకొండలో కారులో లభించిన మృతదేహాన్ని గోదావరిఖని సెంటినరీ కాలనీకి చెందిన మానస అనే యువతిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వినోద్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కారును అద్దెకు తీసుకున్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని విచారించారు. కరీంనగర్‌లోని గదిలో ఉన్న సమయంలో మానసకు ఫిట్స్ వచ్చి మృతి చెందిందని, భయంతో మృతదేహాన్ని కారులో వదిలి వెళ్లినట్లు వినోద్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
