కుతుబ్షాహీ సమాధుల సముదాయంలో వెలుగులోకి
దాదాపు 400 ఏళ్ల నాటి నిర్మాణంగా గుర్తింపు
గోల్కొండ సమీపంలో సొరంగం గుర్తింపు
చారిత్రక ప్రాధాన్యంపై అధికారుల పరిశీలన
నేడు సొరంగాన్ని పరిశీలించనున్న అధికారులు
కొత్త స్వరం, హైదరాబాద్, ఆగస్టు 21: హైదరాబాద్లో భారీ పురాతన సొరంగం వెలుగులోకి వచ్చింది. గోల్కొండ సమీపంలోని దాదాపు 400 ఏళ్ల పురాతన కుతుబ్షాహీ సమాధుల సముదాయంలో ఈ సొరంగం బయటపడింది. సొరంగం చారిత్రక ప్రాధాన్యంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు నేడు సొరంగాన్ని పరిశీలించనున్నారు.
