- వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సెలవు ప్రకటన
- జిల్లా కోర్టులు, లేబర్ కోర్టులు, ట్రిబ్యునళ్లకు వర్తింపు
- ఆగస్టు 21న సాధారణ సెలవుగా ప్రకటన
- సెలవుకు బదులుగా ఆగస్టు 28న కోర్టుల నిర్వహణ
- హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ జారీ
కొత్త స్వరం, అమరావతి, ఆగస్టు 21: వరలక్ష్మీ వ్రతం సందర్భంగా నేడు (2026 ఆగస్టు 21, శుక్రవారం) రాష్ట్రంలోని జిల్లా కోర్టులు, లేబర్ కోర్టులు మరియు ట్రిబ్యునళ్లకు సాధారణ సెలవుగా ప్రకటించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆగస్టు 21న ప్రకటించిన సెలవుకు బదులుగా 2026 ఆగస్టు 28 (శుక్రవారం) నాడు కోర్టులు పనిచేస్తాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
