గ్రామ పరిసరాల్లో నీటి నిల్వల గుర్తింపు
నిల్వ నీటిని తొలగించేందుకు చర్యలు
పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచన
దోమల వృద్ధితో వ్యాధుల నివారణపై అవగాహన
గ్రామ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
కొత్త స్వరం, సింగరేణి, సెప్టెంబర్ 22: ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని భజ్యతండా గ్రామంలో మంగళవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించిన అధికారులు, సిబ్బంది నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించే చర్యలు చేపట్టారు. ప్రజలు తమ ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రతను పాటించాలని సూచించారు. దోమల వృద్ధికి కారణమయ్యే నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా పలు వ్యాధులను నివారించవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు మొత్తం గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భజ్యతండా గ్రామపంచాయతీ సర్పంచ్ వాంకుడోత్ హనుమంతరావు, పంచాయతీ కార్యదర్శి దారావత్ జ్యోతి, ఆశా వర్కర్ అజ్మీర పద్మ తదితరులు పాల్గొన్నారు.
