కంపార్ట్‌మెంట్లు అవసరం లేకుండా ఉచిత దర్శనం
సర్వదర్శనానికి 4 గంటల సమయం
రూ.300 శీఘ్రదర్శనానికి 1-2 గంటలు
నిన్న 82,198 మంది భక్తుల దర్శనం
హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు
కొత్త స్వరం, తిరుమల, సెప్టెంబర్ 23: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఉచిత దర్శనం కోసం భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా దర్శన క్యూలోకి వెళ్లే అవకాశం ఉంది. ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు సుమారు 4 గంటల సమయం పడుతోంది. రూ.300 శీఘ్రదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునే భక్తులకు 1 నుంచి 2 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని మొత్తం 82,198 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,743 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ద్వారా రూ.3.37 కోట్ల ఆదాయం సమకూరింది. నిన్న మొత్తం 4.58 లక్షల లడ్డూలను విక్రయించారు. 1.83 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. వైద్య సేవలు అవసరమైన 3,603 మంది భక్తులకు చికిత్స అందించారు.
