24.5 C
Hyderabad
Homeతాజా వార్తలుకొత్తస్వరం అన్నదానం

కొత్తస్వరం అన్నదానం

  • ఈ నెల 10న నంద్యాల జిల్లా బృందం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా కంకటి రవీందర్ హాజరు
  • దాతల సహకారంతో విలేకరికి పరికరాల పంపిణీ
  • అన్నదాన కార్యక్రమానికి ఆర్కే కుటుంబం ఆర్థిక సహకారం
  • నిర్వహణలో సహకరించిన సయ్యద్ ష‌ర్ప‌రుద్దీన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు
    హైదరాబాద్, ఆగస్టు 7 (కొత్త స్వరం):
    కొత్తస్వరం తెలుగు డైలీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ సోమవారం నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేనలోని మానవతా నిలయం వృద్ధాశ్రమం (ఎస్‌ఆర్‌బీసీ కాలనీ)లో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నంద్యాల జిల్లా కొత్తస్వరం బృందం ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, కొత్తస్వరం పత్రిక తెలంగాణ జనరల్ మేనేజర్ కంకటి రవీందర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సిరి ఏజెన్సీస్, బోధన్ మరియు జగదీష్ హార్వెస్టర్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)కు చెందిన మేడం రామకృష్ణారెడ్డి (ఆర్కే), వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించనున్నారు. ప్రత్యేక దాతల సహకారంతో పాములపాడు కొత్తస్వరం పత్రిక విలేకరి భావన వినోద్ కుమార్ కు నిర్వహణకు అవసరమైన పరికరాలను అందజేయనున్నారు. అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సమాజ సేవే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమం ఏర్పాట్లకు సహకరించిన సయ్యద్ ష‌ర్ప‌రుద్ధీన్ కు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
spot_img

latest articles

explore more

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install KS News App

Add to home screen for faster loading and latest updates.