- ప్రజలందరికీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
- వరలక్ష్మీ దేవి దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్ష
- పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా, సమృద్ధిగా ముందుకు సాగాలని కోరిక
- మహిళామూర్తులకు విశేషమైన శుభాలు, శాంతి కలగాలని ఆకాంక్ష
- ప్రతి కుటుంబం సిరిసంపదలు, సౌభాగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్ష
కొత్త స్వరం, అమరావతి, ఆగస్టు 21: వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సిరిసంపదలకు, సౌభాగ్యానికి, సకల శుభాలకు అధిదేవత అయిన వరలక్ష్మీ దేవి దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పాడిపంటలతో, సుఖసంతోషాలతో రాష్ట్రం సుభిక్షంగా, సమృద్ధిగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కుటుంబ సౌభాగ్యం కోసం శ్రమించే మహిళామూర్తులందరికీ ఈ పవిత్ర పండుగ విశేషమైన శుభాలను, శాంతిని ప్రసాదించాలని కోరుకున్నారు. ప్రజలందరికీ మరోమారు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
