24.2 C
Hyderabad
Homeతెలంగాణచర్లపల్లి జైలులో న్యాయ అవగాహన కార్యక్రమం

చర్లపల్లి జైలులో న్యాయ అవగాహన కార్యక్రమం

ఉచిత న్యాయ సేవలపై కుటుంబ సభ్యులకు అవగాహన

న్యాయ హక్కులు, బెయిల్, అప్పీల్‌పై వివరణ

ఆర్థిక స్థోమత లేకున్నా న్యాయం దూరం కాదని స్పష్టం

లీగల్ హెల్ప్ డెస్క్ ద్వారా న్యాయ సహాయం

వెనుకబడిన వర్గాలకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యం

కొత్త స్వరం, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, సెప్టెంబర్ 22: ఆర్థిక ఇబ్బందుల కారణంగా న్యాయ సహాయం పొందలేని పేదలు, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్ఏ), మేడ్చల్–మల్కాజిగిరి ఆధ్వర్యంలో కాప్రా చర్లపల్లి సెంట్రల్ జైలులో లీగల్ హెల్ప్ డెస్క్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ రవి రాజ్ రాథోడ్ పాల్గొని కీలకంగా సేవలందించారు. జైలు వద్ద ములాఖత్ కోసం వచ్చిన కుటుంబ సభ్యులకు న్యాయపరమైన హక్కులు, ఉచిత న్యాయ సహాయం పొందే విధానం, బెయిల్, అప్పీల్ తదితర అంశాలపై ఆయన సవివరంగా అవగాహన కల్పించారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయ సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని రవి రాజ్ రాథోడ్ స్పష్టం చేశారు. డబ్బు లేకపోవడం వల్ల ఎవరికీ న్యాయం దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రజల్లో న్యాయ హక్కులపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు న్యాయంపై అవగాహన కల్పించడం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు న్యాయ సహాయం అందేలా చూడటం తన బాధ్యతగా భావిస్తూ రవి రాజ్ రాథోడ్ నిరంతరం ప్రజా సమస్యలపై కృషి చేస్తున్నారని కార్యక్రమంలో పాల్గొన్నవారు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వారి హక్కుల సాధనకు సరైన న్యాయపరమైన మార్గాలను తెలియజేయడంలో ఆయన చేస్తున్న కృషి కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.