సచివాలయంలో ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే భేటీ
వైరా అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి
నియోజకవర్గ ప్రజల అవసరాలను సీఎం దృష్టికి
సంక్షేమ పథకాల అమలుపై ఎమ్మెల్యే ప్రస్తావన
మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కృషి
కొత్త స్వరం, కారేపల్లి, సెప్టెంబర్ 22: తెలంగాణ రాష్ట్ర డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మంగళవారం సహచర ఎమ్మెల్యేలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తోందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వైరా నియోజకవర్గానికి అవసరమైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల అవసరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులను త్వరితగతిన, అధిక మొత్తంలో కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ వెల్లడించారు. వైరా నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన మౌలిక వసతులు, అభివృద్ధి ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
