24.7 C
Hyderabad
Homeతాజా వార్తలుఅక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు

అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు

దసరాకు ముందే పెన్షన్లు అందేలా చర్యలు

వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం

అవసరమైతే అదనపు సిబ్బంది నియామకం

ఒంటరి మహిళలు, వితంతువులకు పూర్తిస్థాయిలో పెన్షన్లు

అర్హులైన ప్రతి దరఖాస్తుదారుడికి ప్రయోజనం

కొత్త స్వరం, హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు అందించాలని నిర్ణయించింది. దసరా పండుగకు ముందే అర్హులైన కొత్త లబ్ధిదారులకు పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. కొత్త పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం సూచించింది. పరిశీలన ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించింది. ముఖ్యంగా ఒంటరి మహిళలు, వితంతువులకు పూర్తిస్థాయిలో పెన్షన్లు అందేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకం అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.