24.7 C
Hyderabad
Homeతెలంగాణజూరాల నుంచి కాలువలకు నీటి విడుదల

జూరాల నుంచి కాలువలకు నీటి విడుదల

మంత్రి ఆదేశాలతో జూరాల నుంచి నీరు విడుదల

కుడి కాలువకు 350, ఎడమ కాలువకు 750 క్యూసెక్కులు

పాలమూరు ఆయకట్టు రైతులకు సాగునీటి ఉపశమనం

కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ

కృష్ణా జలాల ప్రవాహాలు, కేటాయింపులపై చర్చ

కొత్త స్వరం, మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 23: తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు జూరాల ప్రాజెక్టు నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రస్తుత పంటల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాలమూరు ఆయకట్టు రైతులకు ఇబ్బందులు కలగకుండా కుడి, ఎడమ కాలువలకు నీటిని మళ్లించారు. ఇందులో భాగంగా కుడి కాలువకు 350 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 750 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆయకట్టు రైతులకు సాగునీటి విషయంలో ఉపశమనం కలిగింది. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బుధవారం సమావేశం కానున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని రైతులు, ఆయకట్టుకు నిరంతరాయంగా కృష్ణా జలాలు విడుదల చేయాలని కోరుతూ మంత్రుల బృందం మంగళవారం రాత్రి కర్ణాటక సీఎంకు ముందస్తుగా వినతిపత్రం సమర్పించింది. నేటి సమావేశంలో ఎగువ ప్రాజెక్టుల నుంచి జూరాలకు వస్తున్న నీటి ప్రవాహాలు, తాగునీరు, సాగునీటి కేటాయింపులపై చర్చించే అవకాశం ఉంది.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.