- సభకు భారీగా తరలిరావాలి
- సుందయ్య విజ్ఞాన కేంద్రంలో కరపత్రం ఆవిష్కరణ
- పాశం యాదగిరి, ఆజాద్ పిలుపు
- ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాలి
- విద్యార్థులు, కార్మికులు, రైతులు పాల్గొనాలి
హైదరాబాద్, అక్టోబర్ 28 (కొత్తస్వరం):
తెలంగాణ ప్రజాఫ్రంట్ 17వ ఆవిర్భావ సభను ఈ నెల 31న కొత్తగూడెంలో విజయవంతం చేయాలని కోరుతూ హైదరాబాద్లోని సుందయ్య విజ్ఞాన కేంద్రంలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమ నాయకుడు ఆజాద్ ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాశం యాదగిరి, ఆజాద్ మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వంపై మరోసారి ప్రారంభమైన కోస్తాంధ్ర పెట్టుబడిదారుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా “ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడదాం” అనే నినాదంతో కొత్తగూడెంలో నిర్వహించనున్న తెలంగాణ ప్రజాఫ్రంట్ 17వ ఆవిర్భావ సభకు విద్యార్థులు, మేధావులు, కార్మికులు, రైతులు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు, మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాంబాబు, ఆజాద్, పాశం యాదగిరి, విద్యార్థి నాయకులు సందీప్, రాజేష్, రమేష్, పైడి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
