24.3 C
Hyderabad
Homeఆంధ్రప్రదేశ్వరికి బీమా గడువు ఇక నాలుగు రోజులే!

వరికి బీమా గడువు ఇక నాలుగు రోజులే!

  • ఈ నెల 15తో ముగియనున్న పంటల బీమా గడువు
  • ఖరీఫ్‌ వరి రైతులకు ఇదే చివరి అవకాశం
  • గడువులోగా ప్రీమియం చెల్లిస్తే తర్వాత ఈ-పంట నమోదు చేసుకునే వెసులుబాటు
  • స్వీయ ధ్రువీకరణతో ముందస్తు పంటల బీమా నమోదు
  • పప్పుధాన్యాల కొనుగోలుకు ఫార్మర్‌ ఐడీ తప్పనిసరి

కొత్తస్వరం, విజ‌య‌వాడ‌

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో వరి సాగు చేస్తున్న రైతులు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనలో నమోదు చేసుకునేందుకు గడువు సమీపిస్తోంది. పంటల బీమా నమోదు గడువు ఈ నెల 15వ తేదీతో ముగియనుండటంతో రైతులు మరో నాలుగు రోజుల్లోగా బీమా ప్రీమియం చెల్లించాలని వ్యవసాయ శాఖ సూచించింది. గడువులోగా బీమా ప్రీమియం చెల్లిస్తే ఈ-పంట నమోదు వివరాలను తర్వాతైనా చేయించుకునే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ తెలిపింది. ముందస్తు పంటల బీమాకు ఈ-పంట నమోదు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. రైతులు తాము పంట సాగు చేస్తున్నట్లు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించి, నిర్ణీత గడువులోగా బీమా ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని పేర్కొంది. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పంట నష్టాల సమయంలో ఆర్థిక భరోసా పొందేందుకు ప్రతి రైతు పంటల బీమాలో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఇదిలా ఉండగా, పప్పుధాన్యాల కొనుగోలుకు ఫార్మర్‌ ఐడీ తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. రైతులు తమ ఫార్మర్‌ ఐడీ క్యూఆర్‌ కోడ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని రిజిస్టర్‌ చేయించుకోవాలని సూచించారు.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.