29.8 C
Hyderabad
Homeఆంధ్రప్రదేశ్శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

  • జూరాల నుంచి 72,849 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
  • శ్రీశైలంలో 878.80 అడుగులకు చేరిన నీటిమట్టం
  • జలాశయంలో 181.8320 టీఎంసీల నీటి నిల్వ
  • ప్రస్తుతం నిల్‌గా ఉన్న ఔట్‌ఫ్లో
  • నిలిచిపోయిన కుడి, ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి

శ్రీశైలం, ఆగస్టు 12 (కొత్తస్వరం):
శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి 72,849 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. సాయంత్రం 6:30 గంటల సమయానికి ఇన్‌ఫ్లో 72,849 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రస్తుతం జలాశయం నుంచి ఎలాంటి నీటిని దిగువకు విడుదల చేయడం లేదు. దీంతో ఔట్‌ఫ్లో నిల్‌గా నమోదైంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 878.80 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 181.8320 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా, శ్రీశైలం కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

latest articles

explore more

App Icon

Install KS News App

Add to home screen for faster loading and latest updates.