నంద్యాలలో ప్రారంభోత్సవ కార్యక్రమం
పాల్గొన్న మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్
కలెక్టర్ రాజకుమారి గణియా హాజరు
ప్రసవానంతరం తల్లీబిడ్డలకు సురక్షిత ప్రయాణం
102 వాహనాల సేవలు అందుబాటులోకి
నంద్యాల, ఆగస్టు 12 (కొత్తస్వరం): నంద్యాల పట్టణంలోని సర్వజన వైద్యశాలలో బుధవారం నిర్వహించిన తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పాల్గొన్నారు. ప్రసవం అనంతరం తల్లి, నవజాత శిశువును సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 102 తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని మంత్రి, కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఐపీఆర్వో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
