రేపు మాజీ సీఎం కర్నూలు పర్యటన
పర్యటన నేపథ్యంలో పోలీసుల ఏర్పాట్లు
సాయంత్రం 5.30 గంటలకు సమావేశం
వ్యాస్ ఆడిటోరియంలో మీడియా సమావేశం
కవరేజ్‌కు మీడియా ప్రతినిధులకు ఆహ్వానం
కర్నూలు, ఆగస్టు 12 (కొత్తస్వరం): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కర్నూలులో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ప్రెస్‌మీట్ జరగనుంది. జగన్ పర్యటనకు సంబంధించిన పోలీసు భద్రత, బందోబస్తు ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఎస్పీ వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. కవరేజ్ నిమిత్తం మీడియా ప్రతినిధులు హాజరు కావాలని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.
