31.6 C
Hyderabad
Homeతెలంగాణఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసిన సూపరింటెండెంట్

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసిన సూపరింటెండెంట్

  • నూతన బాధ్యతలపై ఎమ్మెల్యే శుభాకాంక్షలు
  • మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచన

మణుగూరు, ఆగస్టు 12 (కొత్త స్వరం): బూర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) సూపరింటెండెంట్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనస్తీషియా వైద్య నిపుణులు జి.ప్రసాద్ బుధవారం మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన జి.ప్రసాద్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలిపారు. బూర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎల్‌డీసీ శివ తదితరులు పాల్గొన్నారు.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.