- డీఆర్ఓ, అదనపు ఎస్పీకి మాల మహానాడు వినతి
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్
- అంబేద్కర్‌పై వ్యాఖ్యలతో కోట్లాది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపణ
- కార్యక్రమంలో పాల్గొన్న మాల సంఘాల నాయకులు

నంద్యాల, సెప్టెంబర్ 11 (కొత్త స్వరం):
శుక్రవారం నాడు నంద్యాల జిల్లా డీఆర్ఓ రాము నాయక్, నంద్యాల అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషాకు మాల మహానాడు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించినట్లు మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి దస్తగిరి తెలిపారు. ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాదుపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కోట్లాది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బండి దేవాంతకుడు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, నంద్యాల మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు వెంకటలక్ష్మి, ప్రముఖ న్యాయవాది రాజేంద్రప్రసాద్, పాస్టర్ యేసు రాజు, బండి దేవదాసు, మునగారా రాజారావు తదితరులు పాల్గొన్నారు.
