24.2 C
Hyderabad
Homeతెలంగాణఘనంగా వినాయక అన్న ప్రసాద వితరణ 

ఘనంగా వినాయక అన్న ప్రసాద వితరణ 

శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీలో అన్నదాన కార్యక్రమం

చత్రపతి శివాజీ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహణ

భక్తి, ఐక్యతను పెంపొందించే వేడుకలని ఏనుగు సుదర్శన్ రెడ్డి

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు

కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాలనీ అసోసియేషన్

కొత్త స్వరం, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, సెప్టెంబర్ 22: జవహర్ నగర్ చంద్రపురి కాలనీ డివిజన్-2 కార్పొరేషన్ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీ ఫేస్-Iలో చత్రపతి శివాజీ మహారాజ్ యూత్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలు ప్రజల్లో ఐక్యత, భక్తిభావాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. చత్రపతి శివాజీ టీం యూత్ సభ్యులు, కాలనీవాసులు కలిసికట్టుగా సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జవహర్ నగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కమలాకర్, మేడ్చల్ జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు లావుడ్యా రాము నాయక్, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి మరాఠి రాంబాబు, ఉపాధ్యక్షుడు దొంతమళ్ళ రాంబాబు, మాజీ కార్పొరేటర్ పనుగంటి బాబు, మాజీ ఓబీసీ అధ్యక్షుడు ఆదిములం రాఘవేంద్ర, షాగా అనిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్లు జవహర్ నగర్ డివిజన్ అరుణ్, చంద్రపూరి కాలనీ రాంబాబు, జవహర్ నగర్ మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహణలో చత్రపతి శివాజీ మహారాజ్ యూత్ టీం సభ్యులు గరడ్ దత్తా, మల్లూరి శ్రీనివాస్ (బొట్టు), కే. సాయి, కోటగిరి సంతోష్, గుండెటి యశ్వంత్, మల్లూరి వివేక్, గరడ్ ఆరుషి తదితరులు కీలక పాత్ర పోషించారు. వేడుకను విజయవంతం చేయడంలో కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు విశేష కృషి చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఆర్.సి. శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ కుమ్మరి కృష్ణ, కోశాధికారి కత్తెర్ల కిరణ్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు మూకర రవి, రంగుల హరికృష్ణ, గౌరవ అధ్యక్షుడు ఎం. లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు రంగుల శంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు కొండ్రాతి నరేష్, కోటగిరి సంతోష్ కుమార్, కార్యదర్శులు గరడ్ మహిపత్రావు దత్త, చిక్క రఘు, కెమ్మసరం నగేష్, సహాయ కార్యదర్శులు కెమ్మసరం సుజాత, మన్నె జ్యోతి, టి. సుజాత, గౌరవ సలహాదారులు సిల్వేరి శ్రీకాంత్, కెమ్మసరం చంద్రయ్య, పండుగ సతీష్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే కార్యవర్గ సభ్యులు సి.హెచ్. బస్వరాజు, ఎర్ర వెంకటేష్, ఎం. వంశీ, వై. మహేందర్, చట్టు చిరంజీవి, తన్నీరు నాగరాజు, కుంచాల నవీన్ కుమార్, మిత్రా గౌతమ్, ఏ. నాగచారి, ఆర్. చిత్తారి తదితరులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.