26.7 C
Hyderabad
Homeతెలంగాణడిగ్రీ కళాశాలల్లో 544 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్

డిగ్రీ కళాశాలల్లో 544 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్

  • సహాయ ఆచార్యులు, అధ్యాపకుల పోస్టుల భర్తీకి కసరత్తు
  • టీజీపీఎస్సీ ద్వారా త్వరలో నోటిఫికేషన్‌
  • కొత్త జీఓతో మారనున్న నియామక విధానం
  • అకడమిక్‌ ప్రతిభకు 50, రాత పరీక్షకు 40 మార్కులు
  • మరో వెయ్యి పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 24 (కొత్త స్వరం): ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 544 సహాయ ఆచార్యులు, అధ్యాపకుల పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఆర్థికశాఖ అనుమతి ఉన్న ఈ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది. కొత్త జీఓ-4 ప్రకారం నియామక విధానంలో మార్పులు చేయనుండగా, అకడమిక్‌ ప్రతిభకు 50, రాత పరీక్షకు 40, ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించనున్నారు. 491 అధ్యాపకులు, 24 లైబ్రేరియన్లు, 29 పీడీల పోస్టుల భర్తీకి 2022 డిసెంబరులో జారీ చేసిన నోటిఫికేషన్‌ యూజీసీ మార్గదర్శకాలు, విద్యార్హతలపై అభ్యంతరాలతో నిలిచిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల సంఖ్య 150కి చేరగా, 4,098 మంజూరు పోస్టులకు 1,500 మంది రెగ్యులర్‌, 2 వేల మంది అతిథి, సుమారు 400 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. కనీసం మరో 2 వేల పోస్టులు అవసరమని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 544 పోస్టులకు అనుమతి ఉండటంతో వాటిని భర్తీ చేయనుండగా, మరో వెయ్యి ఖాళీల భర్తీకి అనుమతి ఇవ్వాలని కళాశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.