31.2 C
Hyderabad
Homeఆంధ్రప్రదేశ్తాడేపల్లిలో జగన్‌ను కలిసిన మాధవరావు

తాడేపల్లిలో జగన్‌ను కలిసిన మాధవరావు

  • ఏకగ్రీవ ఎన్నికపై కృతజ్ఞతలు
  • అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు
  • బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని హామీ
  • కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వక భేటీ
  • మాధవరావుకు జగన్‌ అభినందనలు
    కొత్త స్వరం, తాడేపల్లి:
    ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా తనకు అవకాశం కల్పించినందుకు వైయస్‌ జగన్‌కు మాధవరావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పదవికి వన్నె తెచ్చేలా బాధ్యతలను నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాధవరావు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాధవరావును వైయస్‌ జగన్‌ అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వైఎస్సార్‌సీపీకి చెందిన శాసనమండలి సభ్యులు కూడా ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ను కలిశారు. మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నికైన నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు.

latest articles

explore more

App Icon

Install KS News App

Add to home screen for faster loading and latest updates.