- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
- కేసులో స్టేషన్ బెయిల్, చార్జ్‌షీట్ సమయంలో సహాయం చేస్తానని డిమాండ్
- తన నివాసంలో నగదు స్వీకరిస్తుండగా పట్టివేత
- నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరు
- లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయాలని సూచన
కొత్త స్వరం, కామారెడ్డి, ఆగస్టు 21: కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్‌ఐ దువ్వల ఆంజనేయులు రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ కేసులో స్టేషన్ బెయిల్, చార్జ్‌షీట్ సమయంలో సహాయం చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. గురువారం తన నివాసంలో రూ.30 వేలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ నంబర్ 9440446106కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
